BSF Jawan Purnam Wife: పాకిస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్

BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ తాజాగా భారత్‌కు అప్పగించింది. దీంతో బీఎస్ఎఫ్ భార్య సంతోషం వ్యక్తం చేసింది. తన భర్త తిరిగి క్షేమంగా రావడానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

New Update
BSF Jawan Purnam Wife:

BSF Jawan Purnam Wife Rajini

ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ తాజాగా భారత్‌కు అప్పగించింది. అమృత్‌సర్‌లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను అప్పగించారు. ఈ విషయం తెలిసి పూర్ణమ్ కుమార్ భార్య రజని సంతోషం వ్యక్తం చేసింది.

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు. ఉదయం పూర్ణం జీ వచ్చారని BSF ప్రధాన కార్యాలయం నుండి నాకు కాల్ వచ్చింది. 22 రోజుల తర్వాత నేను అతన్ని వీడియో కాల్‌లో చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయాను. అతను గడ్డం విపరీతంగా పెరగడంతో మొదట నేను అతన్ని అస్సలు గుర్తించలేకపోయాను. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. తాను బాగున్నానని.. తన వైద్య పరీక్ష కూడా పూర్తయ్యాయని చెప్పాడు. భోజనం చేసిన తర్వాత 3 గంటలకు మీకు ఫోన్ చేస్తానని చెప్పాడు. దీంతో అతను ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఇష్టమైన ఆహారాలు అన్నీ చేస్తాను. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడో మనం ఆశ వదులుకున్నాం. చాలా రోజులు గడిచిపోయాయి. ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కానీ కాల్పుల విరమణ అనంతరం ఆయన మూడు రోజుల్లోనే తిరిగి వచ్చారు. 

Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చాలా ధన్యవాదాలు. అలాగే మూడు-నాలుగు రోజులుగా నాకు తరచూ ఫోన్ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మమతా జీ నా వైద్య చికిత్స గురించి కూడా అడిగారు. అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాను.’’ 

Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!

మమతా బెనర్జీ పోస్టు వైరల్

‘‘మన బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా విడుదలయ్యారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. నేను అతని కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాను. హూగ్లీలోని రిష్రాలో అతని భార్యతో మూడుసార్లు మాట్లాడాను. నేటికీ నేను ఆమెకు ఫోన్ చేస్తున్నాను. దేశ జవాన్ లాంటి నా సోదరుడు, అతని భార్య రజనీ షా, అతని మొత్తం కుటుంబానికి శుభాకాంక్షలు అని మమతా బెనర్జీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.’’

Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

ind pak war | bsf jawan purnam sahu | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు