/rtv/media/media_files/2025/05/14/TjY2vPwsQUXEWiKaPzi0.jpg)
Cristiano dos Santos debut for the Portugal U-15 National Team
ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా అతడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఫుల్‌బాల్ గేమ్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. మరోవైపు అతని కొడుకు కూడా ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.. రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో డాస్ శాంటోస్ ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టాడు. అతడు పోర్చుగల్ నుంచి అండర్ 15 జట్టులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
Cristiano dos Santos
తండ్రికి తగ్గ తనయుడిగా అదరగొడుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా వ్లాట్కో మార్కోవిచ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ అండర్ 15 తరఫున దుమ్ము దులిపేశాడు. ఆ మ్యాచ్‌లో జపాన్‌పై పోర్చుగల్ ఘన విజయం సాధించింది. పోర్చుగల్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో డాస్ శాంటోస్ 54వ నిమిషంలో గ్రౌండ్‌లోకి వచ్చాడు.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
అనంతరం ఫార్వర్డ్ ప్లేయర్‌గా తనదైన శైలిలో అద్భుతమైన స్కిల్స్ ప్రదర్శంచి వావ్ అనిపించాడు. 14 ఏళ్లకే అనుభవైజ్ఞుడైన ప్లేయర్లా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు ఇప్పటికే జువెంచస్ యూత్ అకాడమీ తరఫున దాదాపు 58 గోల్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రిస్టియానో డాస్ శాంటోస్ అల్ నాసర్ అకాడమీకి ఆడుతున్నాడు. ఇక పోర్చుగల్ టీమ్‌లోకి డాస్ శాంటోస్ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా అతడి గ్రాండ్ మదర్ మారియా ఎమోషనల్ అయ్యారు.
ఇది కూడా చదవండి: ఈ పండులో రుచికరమైన ఆరోగ్య రహస్యం ఇదే
మ్యాచ్ ముగిసిన తర్వాత జూనియర్ క్రిస్టియానోకు ముద్దు పెట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. జూనియర్ క్రిస్టియానో కూడా తన తండ్రి లాగే 7వ నెంబర్ జెర్సీ ధరించి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే తన కొడుకు ఎంట్రీ పై రొనాల్డ్ స్పందించి ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ఒక పోస్టు పెట్టాడు.
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
cristiano-ronaldo | latest-telugu-news | telugu-news | sports-news
Follow Us