Missing: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!

కడపకు చెందిన ఆర్మీ ఉద్యోగి బైరెడ్డి నాగార్జునరెడ్డి అదృశ్యమయ్యారు. సెలవులపై ఇంటికొచ్చి ఏప్రిల్ 1న తిరిగి విధులకు వెళ్తున్నట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లకపోవడంతో అధికారులు ఆయన తండ్రికి ఫోన్‌చేసి చెప్పారు. వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

New Update
Kadapa Army employee Byreddy Nagarjuna Reddy missing

Kadapa Army employee Byreddy Nagarjuna Reddy missing

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం ముదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి బైరెడ్డి నాగార్జున రెడ్డి అదృశ్యం అయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైరెడ్డి నాగార్జున రెడ్డి ఉత్తరఖాండ్ రాష్ట్రంలో రేంజ్ ఆర్మీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఆర్మీలో సెలవులు తీసికొని ఫిబ్రవరి నెలలో తన స్వగ్రామం అయిన ముదిరెడ్డి పల్లికి వచ్చాడు. 

ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

అనంతరం తన సెలవులు పూర్తి కావడంతో గత నెల అంటే ఏప్రిల్ 1వ తేదీన మళ్లీ తిరిగి ఆర్మీలో విధులకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఒక రోజు బైరెడ్డి నాగార్జున రెడ్డి తండ్రి నారాయణ రెడ్డికి ఆర్మీ అధికారులు ఫోన్ చేశారు. మీ అబ్బాయి ఇంకా విధులకు హాజరు కాలేదని తెలియజేశారు.

దీంతో ఆయన చాలా కంగారు పడ్డారు. ఇంటి నుంచి పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లకపోగా.. ఇప్పటి వరకు ఇంటికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందుతున్నారు. దీంతో ఆర్మీ ఉద్యోగి బైరెడ్డి నాగార్జున రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

హైదరాబాద్‌లో విషాదం

హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ భాగాయత్‌ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు  ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన బాలురు అర్జున్ (8) , మణికంఠ (15)గా  గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతోపాటు వలస వచ్చి ఉప్పల్‌లోని కుర్మానగర్‌లో నివాసం ఉంటున్నారు. 

పిల్లర్ గుంతలో మృతదేహాలు

చిన్నారుల తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేసుకుంటే జీవనం కోనసాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించక పోవటం వలన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదులో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రాత్రి నుండి గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం భాగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్, మణికంఠ మృతదేహాలు లభ్యమైంది. 

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

ఈ ఘటనపై  అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలురు ఆ గుంత దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. స్పష్టత కోసం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల వారి విచారిస్తున్నారు. బాలురును వెతికేందుకు హైడ్రా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ సహాకారాలు అందించారు. జీవనోపాధి కోసం వచ్చి ఇలా ఇద్దరు పిల్లలు కోల్పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు చిన్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

army | latest-telugu-news | telugu-news | crime news | Latest crime news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు