HYD Crime News: ‘అత్తా మీ కూతుర్ని చంపేశా’.. HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త!

HYDలోని బాలాపూర్‌లో దారుణం జరిగింది. భార్య నజియా బేగం వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త జాకీర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను కర్రతో కొట్టి, గొంతు నులిమి, గాజు పెంకుతో కోసి హత్య చేశాడు. అనంతరం అత్త రుబీనాకు చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు.

New Update
hyderabad balapur husband kills his wife on suspicion and flees

hyderabad balapur husband kills his wife on suspicion and flees

ఈ మధ్య కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాల పేరుతో జరిగిన హత్యలే ఎక్కువ. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి కొందరు, అనుమానంతో ఇంకొందరు బలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. 

Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా కొట్టి కొట్టి.. గొంతునులిమి చంపేశాడు. ఆపై అత్తకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!

అనుమానంతో హత్య

జాకీర్ అహ్మద్ (31), నజియా బేగం (30) దంపతులు నగర శివారు ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ గ్రీన్ సిటీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. గతంలో ఈ దంపతులు గోల్కొండ ప్రాంతంలో ఉండేవారు. ఈ మధ్యే బాలాపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అయితే నజియా బేగం ఈవెంట్‌లలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏరియాకు వచ్చిన కొద్ది రోజులు ఈ దంపతులు బాగానే ఉన్నారు. 

Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

కానీ గత కొన్ని రోజుల నుంచి భార్య నజియాపై జాకీర్‌కు అనుమానం వచ్చింది. ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం అంటే మే 13వ తేదీన రాత్రి ఇదే విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు. అదే గొడవలో భర్త జాకీర్ తన భార్యను కొట్టి హత మార్చాడు. ఆపై మరుసటి రోజు బుధవారం అత్త రుబీనాకు జరిగిన ఘోరం గురించి చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. 

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

దీంతో మృతురాలి తల్లి రుబీనా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించారు. నిందితుడు మృతిరాలిని  కర్రతో గట్టిగా కొట్టి.. ఆపై ఆమె గొంతు నులిమి.. గాజు పెంకుతో కోసేసినట్లున్న ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఇక మృతురాలి తల్లి రుబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

latest-telugu-news | crime news | HYD Crime | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు