/rtv/media/media_files/2025/05/14/hYoVXl5gMGOk7brOLirw.jpg)
kumbhmela viral girl monalisa another video viral in social media
ఈ ఏడాది మహా కుంభమేళాలో సంచలనంగా మారిన వారిలో మోనాలిసా ఒకరు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఆమె జీవితాన్నే మార్చేసింది. పూసలు అమ్ముకునే మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆమె రేంజే మారిపోయింది. ఏకంగా సినిమా ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు ఒక సినిమా ఆఫర్ ఇచ్చాడు. అయితే అది పట్టాలెక్కకముందే డైరెక్టర్ పై అత్యాచారం కేసు నమోదు అయింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
దీంతో మోనాలిసాకు వచ్చిన ఒక్కగానొక్క సినిమా ఆఫర్‌కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆమె ఫాలోయింగ్ ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు ఆమె ఒక సాంగ్ చేస్తుంది. ఉత్కర్ష్ సింగ్‌తో మోనాలిసా అదిరిపోయే సాంగ్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆ సాంగ్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్వరలో దానిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ తరుణంలో మోనాలిసా బయట కనిపించి తన లుక్‌తో అందరికీ గట్టి షాక్ ఇచ్చింది.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
మోనాలిసా లుక్కు వేరే లెవెల్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంతరం మోనాలిసా కెమెరాకు ఫోజులిచ్చింది. అక్కడే మీడియాతో మాట్లాడింది. తాను నటిస్తున్న పాట గురించి తెలిపింది. సాంగ్ నేమ్ చెప్పకపోయినా.. ఆ సాంగ్ షూటింగ్ మాత్రం బాగా జరిగిందని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో ఆమెతో ఒక కెమెరామాన్ ఫొటో తీయించుకున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!
అందులో మోనాలిసా లుక్ అంతా బాగా ఛేంజ్ అయిపోయింది. మొదట్లో చూసిన మోనాలిసా.. ఇప్పుడు చూస్తున్న మోనాలిసాకు చాలా తేడా కనిపించింది. వైరల్‌గా మారిన వీడియోకు దాదాపు 2.7 మిలియన్ వ్యూస్, 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మోనాలిసా స్టైల్ మారిపోయిందని అంటున్నారు.
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
latest-telugu-news | telugu-news | monalisa | maha kumbh monalisa
Follow Us