Terrorists Arrest: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8మంది ఉగ్రవాదుల అరెస్ట్..!
దేశంలో ఉగ్రవాదుల కదలికలు మరోసారి కలకలం రేపాయి. దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు ఒక ఐసిస్ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.