PM Modi : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన..  తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై  తీవ్రంగా స్పందించారు

New Update
pm modi

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన..  తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయం(Sabarimala Temple)లో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై  తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ(bjp) అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, దోషులను జైలుకు పంపుతామన్నారు.  ఇది మోదీ గ్యారెంటీ అని ఆయన చెప్పుకొచ్చారు. 

Also Read :  ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై

కేరళను ఇన్నాళ్లు పాలించిన ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై ప్రధాని విరుచుకుపడ్డారు. దేశం మొత్తానికి అయ్యప్ప స్వామిపై విశ్వాసం ఉంది. కానీ ప్రస్తుత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం శబరిమల సంప్రదాయాలను దెబ్బతీయడానికి ఏ అవకాశాన్ని వదల్లేదని మోదీ విమర్శించారు. కేరళ భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం NDA కూటమికే ఉందని, ఇది అభివృద్ధి, సుపరిపాలనకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మరియు కొత్త రైలు సర్వీసులను కూడా ప్రారంభించారు.

కాగా శబరిమల ఆలయ గర్భాలయ ద్వారాలకు, ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు రేకులు మాయమయ్యాయనే ఆరోపణలు కేరళలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది.

Also Read :  జైల్లో ఖైదీల మధ్య  పుట్టిన ప్రేమ..పెళ్లికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Advertisment
తాజా కథనాలు