KTR SIT Investigation: ముగిసిన KTR విచారణ.. కాసేపట్లో ప్రెస్ మీట్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు7  గంటల పాటు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు.

New Update
KTR

KTR

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case) లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణ(SIT investigation) కు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు7  గంటల పాటు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు.  ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి పలువురు బిజినెస్ మెన్ లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారా? అన్న కోణంలో విచారణ సాగినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను సిట్  రికార్డ్ చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి యాక్షన్ ప్లాన్‌పై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్(ktr) కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. 

Also Read :  నేను తప్ప ఏ రావు లేడక్కడ.. KTR సంచలన విషయాలు!

ఉదయం 11 గంటలకు

కాగా సిట్ నోటీసుల మేరకు కేటీఆర్ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట హరీష్ రావుతో పాటుగా ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు వెళ్లారు. కేటీఆర్ రాక సందర్భంగా పోలీసులు జూబ్లీహిల్స్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయం బయట బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది.

Also Read :  కవిత కాంగ్రెస్‌లోకి వస్తానంటున్నారు.. కానీ నేనే వద్దన్నా :  మహేష్ కుమార్ గౌడ్

Advertisment
తాజా కథనాలు