Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది.

New Update
amazon

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ(Ecommerce Company) అమెజాన్(Amazon Layoffs) తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కంపెనీలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును మెరుగుపరచడంలో భాగంగా మొత్తం 30 వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే జనవరి 27 నుంచే ఈ లేఆఫ్స్ ప్రక్రియ మొదలు పెట్టనుంది. 

Also Read :  చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్కరోజులోనే రూ. 5 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15.8 లక్షల మంది సిబ్బందిలో ఈ తొలగింపులు కేవలం 10 శాతం కార్పొరేట్ ఉద్యోగులపైనే ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తో పాటు రీటైల్, ప్రైమ్ వీడియో, ఎంటర్టైన్మెంట్, హెచ్ఆర్ (HR) విభాగాల్లో ఈ కోతలు ఎక్కువగా ఉండనున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో కూడా అమెజాన్ దాదాపు 14 వేల మందిని తొలగించింది, ఇప్పుడు రెండో విడతగా మరోసారి అదే స్థాయిలో ఉద్యోగులను తొలిగించనుంది. 

అయితే ఈ భారీ లేఆఫ్ లపై అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ స్పందిస్తూ.. ఇది ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్లనో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. కంపెనీలో అవసరానికి మించి మేనేజర్లు, లేయర్లు పెరిగిపోవడంతో పనిలో వేగం తగ్గుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read :  అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

27 వేల ఉద్యోగాలు ఔట్

మరోవైపు, కంపెనీలో పనితీరు సరిగ్గా లేని వారిని ముందే గుర్తించి వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా ఫోరమ్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఉద్యోగులకు ఈ కోతలపై హింట్లు ఇస్తుండటంతో అమెజాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మేనేజర్లు ఆందోళనలో ఉన్నారు. కాగా అమెజాన్ 2022 చివరి నుంచి 2023 ప్రారంభం వరకు సుమారు 27 వేల ఉద్యోగాలను తొలగించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోత.  

Advertisment
తాజా కథనాలు