/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
బంగారం ధరలు(Gold Rates) చుక్కలు చూపిస్తున్నాయి. ఓ రోజు తగ్గుతూ మరో రోజూ పెరుగుతూ అసలు ఇప్పుడు బంగారం కొనలా వద్దా అనే డైలామాలో పడిపోయేలా చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఏకంగా రూ. 5 వేలు పెరిగింది. 2026 జనవరి 23వ తేదీ రోజున బంగారం ధర రూ. 5వేల400 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710కు చేరుకుంది.
ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 146,400కు చేరుకుంది(Today Gold Rate Hyderabad). ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర(silver rates) ప్రస్తుతం రూ. 3,60,000 వద్ద ఉంది. ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు అవుతుండటంతో ఈ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు పెరగడం, డాలర్ విలువలో మార్పులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం కూడా ఈ 'జంప్'కు కారణమైంది. దీనికి తోడు గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారిన వేళ తగ్గుముఖం పట్టిన పసిడి ధర మళ్లీ పైకెగిసింది.
Also Read : అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !
ఢిల్లీలో తులం ఎంతంటే ?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,59,860గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,550గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల ధర రూ. 1,59,820గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,400గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,59,710గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,400గా ఉంది.
Follow Us