/rtv/media/media_files/2026/01/23/nine-2026-01-23-18-22-27.jpg)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో రాయ్‌పూర్ పోలీస్ రేంజ్ (ధమ్తరి, గరియాబంద్ జిల్లాలు) ఇప్పుడు నక్సల్స్ రహిత ప్రాంతంగా మారిందని ఐజీ అమరేష్ మిశ్రా అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరంతా ఒడిశా స్టేట్ కమిటీ కింద పనిచేస్తున్న వివిధ దళాలకు చెందినవారు.
Also Read : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !
- జ్యోతి అలియాస్ జైని (28) : సీతానది ఏరియా కమిటీ సెక్రటరీ (రూ. 8 లక్షల రివార్డు).
- ఉష అలియాస్ బాలమ్మ (45): డివిజనల్ కమిటీ సభ్యురాలు. ఈమె తెలంగాణ నివాసి (రూ. 8 లక్షల రివార్డు).
- మరో ఆరుగురు కేడర్లు: రామదాస్ మర్కం, రోణి, నిరంజన్, సింధు, రీనా, అమిలా (వీరిపై తలకూ రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉంది).
- లక్ష్మి పునెం (18): రూ. లక్ష రివార్డు.
వీరి నుంచి రెండు ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, రెండు ఎస్ఎల్ఆర్ (SLR)లు, కార్బైన్, మజిల్ లోడింగ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
9 #Maoists with Rs 47 Lakh Bounty Surrender in #Chhattisgarh
— Pragativadi (@PragativadiNews) January 23, 2026
Read More: https://t.co/rUC2ykG5uB
Also Read : 26 ఏళ్ళ తర్వాత చరిత్ర పునరావృతం.. ఆదివారం రోజున బడ్జెట్.. స్టాక్ మార్కెట్లు ఓపెన్
భావజాలం పట్ల విరక్తి
మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెందడం, అడవిలో ఎదురవుతున్న కష్టాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాల వల్ల తాము ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. రాయ్‌పూర్ రేంజ్ పరిధిలో ఉన్న మావోయిస్టులందరూ ఇప్పుడు హతమవ్వడం లేదా లొంగిపోవడం జరిగింది. అయితే బస్తర్ రేంజ్, రాజ్‌నంద్‌గావ్ పరిసరాల్లో ఇంకా మావోయిస్టుల ప్రభావం కొనసాగుతోందని ఐజీ అమరేష్ మిశ్రా పేర్కొన్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా మావోయిజంను పూర్తిగా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ఛత్తీస్‌గఢ్‌లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2026లో ఇప్పటివరకు 189 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనవరి 15న బీజాపూర్‌లో 52 మంది లొంగిపోయారు. గతేడాది మొత్తం 1,500 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
Follow Us