/rtv/media/media_files/2026/01/23/bangladesh-2026-01-23-17-29-35.jpg)
టీ20వరల్డ్ కప్(T20 World Cup 2026) కు ముందు బంగ్లాదేశ్(bangladesh) క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. భద్రతాపరమైన సమస్యలు చూపిస్తూ.. తమ మ్యాచ్‌లను ఇండియా నుండి శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీ(icc) ని కోరింది. అయితే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు చేయబోమని ఐసీసీ చెప్పేసింది. ఈ క్రమంలో బీసీబీ టీ20వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీనివల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్న బీసీబీకి భారీ ఆర్థిక ఎదురుదెబ్బ తగలుతుంది. దాదాపు 27 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ. 240 కోట్లు నష్టపోతుంది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వార్షిక ఆదాయంలో 60 శాతానికి సమానం. బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆ దేశం పూర్తిగా కోల్పోనుంది.
Also Read : వరల్డ్ కప్ ముందు ఆఖరి సీరీస్.. ఇదైనా సరిగ్గా ఆడతారా?
తదుపరి స్థానంలో స్కాట్లాండ్
ఇదంతా తెలిసిన కూడా బీసీబీ(BCB) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. "మా ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేం. భారత్‌లో భద్రతపై ఐసీసీ ఇచ్చిన హామీ మాకు సంతృప్తినివ్వలేదు. ఇది కేవలం క్రికెట్ బోర్డు నిర్ణయం కాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం" అని తేల్చి చెప్పారు. తాము ఇంకా ఆశలు వదులుకోలేదని, ఐసీసీ తమ విన్నపాన్ని మళ్ళీ పరిశీలించి శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం జట్టు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ తదుపరి స్థానంలో ఉంది.
టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఇండియాలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు కోల్‌కతాలో, ఒకటి ముంబైలో. పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను BCCI సూచనల మేరకు IPL నుండి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేసింది.
ఇక భారత్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్.. తమ దేశంలో వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారాలను కూడా నిషేధించింది. సాధారణంగా ఏ దేశమైనా టోర్నీలో లేకపోయినా, క్రికెట్ క్రేజ్ దృష్ట్యా ప్రసార హక్కుల ద్వారా ఆదాయం పొందుతుంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రసారాలను బ్యాన్ చేయడం వల్ల వచ్చే స్పాన్సర్‌షిప్ ఆదాయం కూడా సున్నా అయిపోతుంది.
Also Read : ఎప్పుడో ఆడడం మానేసా... ప్రత్యేకంగా రిటైర్మెంట్ అని చెప్పలేదు.. సైనా నెహ్వాల్
Follow Us