CM Revanth Reddy : సీబీఐకి కాళేశ్వరం.. అసలు రేవంత్ స్కెచ్ ఏంటి?
2022లో తెలంగాణలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును బీజేపీకి అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది.
2022లో తెలంగాణలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును బీజేపీకి అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలు లావణ్య ఫ్యానుకు ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్‌కు కోసం బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 40 లక్షలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్‌తో పాటు -ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్ఎంఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ అయిన రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు.
అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నకు దిగారు. BRS నేత హరీశ్ రావు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. యూరియా కొరత తీర్చాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వద్దకు చేరుకున్నారు.
నల్గొండ జిల్లా అనుముల కేవీ కాలనీలో గణేష్ మండపంలో విద్యుత్ షాక్‌కు గురై 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు దండెమ్ మహేందర్, మౌనికల కుమారుడు మణికంఠగా గుర్తించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో పాముకాటుకు గురై రైతు రఘురాములు మరణించాడు.
డీలర్ల బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్లు అన్నారు. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు.
రాజకీయాల్లో వారిద్దరూ ఉప్పునిప్పులా ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుంటారు. అలాంటిది వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటారు. కానీ అలాంటివేం ఉండవని రుజువైంది. ఇద్దరూ ప్రత్యర్థులైనా వారి మధ్య నవ్వుల, పువ్వులు పూస్తాయని వెల్లడైంది.