/rtv/media/media_files/2025/12/17/shankarpalli-2025-12-17-10-52-20.jpeg)
తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్(polling) నేటితో ముగియనుంది. ఈ సందర్బంగా ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంపకాలు జరిగాయి. బహుషా ఈ లెక్కన డబ్బులు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కూడా చూసిఉండకపోవచ్చు ఆ గ్రామస్తులు. అసెంబ్లీ ఎన్నిక(telangana-local-body-elections) లను తలదన్నేలా హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్(Shankarapalli Gram Panchayat elections) జరిగాయి. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ఓటర్లను మచ్చిక చేసుకున్నారు.
Also Read : సిర్పూర్-యు అడవుల్లో 16 మంది నక్సల్స్ అరెస్ట్
Shankarapalli Gram Panchayat Elections 2025
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గ్రామపంచయతీ ఎన్నికల్లో రూ.6వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. శంకరపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలు మూడో దశలో ఈరోజు(సెప్టంబర్ 17)న ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు భూములు అమ్ముకుని మరీ కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. శంకరపల్లిలో ఓటుకు రూ.55వేలు వరకు ఇచ్చారు. మొదట ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.40వేలు పంచాడు. తనకంటే నేనేం తక్కువ కాదని మరో పార్టీ అభ్యర్థి ఒక్క ఓటరుకు రూ.50వేలు పంచాడు. వీరిద్దరి తానేం తక్కువ తీసిపోనని మూడో పార్టీ అభ్యర్థి రూ.ఒక్కో ఓటుకు రూ.55 వేలు పంచినట్లు సమాచారం. ఇలా దాదాపు ఈ గ్రామ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.లక్షా 50 వరకూ డబ్బులు ముట్టాయి.
పటాన్‌చెరులోనూ ఓ సర్పంచ్ అభ్యర్థి రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఓటుకు వెయ్యి నుంచి 5వేలు పంచినట్లు సమాచారం. డబ్బులతోపాటు మందు, చీరలు, గిఫ్టులు బోనస్ ఇచ్చి ఓటర్ల మెప్పు పొందాలని ప్రయత్నించారు. కొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తు అభ్యర్థులు ఏకంగా వెండి ఉంగరాలు పంచుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి గ్రామాలకు వెళ్లే వాళ్లకు దారి ఖర్చులు అభ్యర్థులే ఇస్తున్నారట.
Also Read : కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!
Follow Us