/rtv/media/media_files/2025/12/15/kavita-2025-12-15-17-08-52.jpg)
Kavita
జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఎక్స్‌లో ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మీ ప్రశ్నలు, ఆలోచనలు ఆస్క్ కవితతో పంచుకోవాలంటూ ఆమె ట్వీట్ చేశారు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్
Kavitha Responds Upcoming Elections
దీంతో యూజర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూజర్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగాడు. దీనికి కవిత అవును అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పోటీగా ఎన్నికల బరిలోకి దిగనుందని క్లారిటీ వచ్చేసింది. జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికే పరిమితం చేశారు, ఎందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని మరో యూజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత.. రాష్ట్రవ్యాప్తంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతీ గ్రామంలో కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
We are working across the state & will be forming committees in every village of Telangana .. slowly but strongly !! #JagruthiJanamBaatahttps://t.co/EhMOcBRzQt
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
Also Read : బర్త్ డే పార్టీ.. దువ్వాడ జంటకు మరోషాక్...ఆయనకు నోటీసులు
Follow Us