Family Contests:  ఫ్యామిలీ పంచాయతీ...అయినోళ్లే ప్రత్యర్థులు

తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో పదవి దక్కించుకునేందుకు అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు సై అంటే సై అంటూ బరిలో నిలిచి విజయం సాధించారు.

New Update
FotoJet (14)

Family Panchayat.

తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికలు(big twist in sarpanch elections) రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా సాగిన పోరులో పలువురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో పదవి దక్కించుకునేందుకు అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు సై అంటే సై అంటూ బరిలో నిలిచి విజయం సాధించారు. సొంత కుటుంబ సభ్యులే ఒకరిపై మరొకరు పోటీకి దిగటం ఆశ్చర్యం అనిపించినా పదవి దక్కించుకునేందుకు  అన్ని రకాల ఎత్తుగడలు వేసి విజయం సాధించారు.

Also Read :  సర్పంచ్‌ ఎన్నికల్లో విజేతలను చేసిన ఒక్క ఓటు..

తండ్రీకొడుకుల ఫైట్‌

మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా తండ్రీకొడుకులు నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. మెదక్‌ జిల్లాలోని ఝాన్సీ లింగాపూర్‌ సర్పంచ్‌ స్థానానికి తండ్రీకొడుకులు(son, father) పోటీపడగా ఓటర్లు తండ్రికే పట్టం కట్టారు. లింగాపూర్‌ ఎన్నికల్లో మానెగళ్ల రామకృష్ణయ్య కాంగ్రెస్‌ మద్దతుతో, ఆయన కుమారుడు వెంకట్‌ బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు. ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల్లో 1331 ఓట్లు పోలవ్వగా ఇందులో 684 ఓట్లు సాధించిన రామకృష్ణయ్య తన కుమారుడిపై 99 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఔ

తల్లీకూతుళ్లు పోటీకి సై

అలాగే  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో తల్లీకూతుళ్లు పోటీకి సై అన్నారు. పెనుబల్లి గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ అయింది.  దీంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున తేజావత్‌‌‌‌‌‌‌‌ సామ్రాజ్యం నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. అయితే అదే గ్రామంలో ఉంటున్న సామ్రాజ్యం కూతురు బానోత్ పాప బీఆర్‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరఫున నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో ఇక్కడ ఎన్నిక తల్లీకూతుళ్ల మధ్య సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది.

అన్నాచెల్లెళ్లు పోటీ

ఇక, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం సర్పంచ్‌ స్థానానికి బొర్ర కృష్ణ, పొడుగు సుగుణ అనే అన్నాచెల్లెళ్లు పోటీ పడ్డారు. కృష్ణను కాంగ్రెస్‌, సుగుణను బీఆర్‌ఎస్‌ బలపరిచాయి. కానీ, ఆదివారం జరిగిన ఎన్నికలో 318 ఓట్లు సాధించిన కృష్ణ తన సోదరి(sister, brother) పై 107 ఓట్లు తేడాతో గెలిచారు. 

అక్కాచెల్లెళ్ల ఆరాటం

ఇక, ఖమ్మం జిల్లా కొంగరలో సర్పంచ్‌ స్థానానికి అక్కాచెల్లెళ్లు పోటీ పడగా అక్కకు ఓటర్లు పట్టం కట్టారు. కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిగా చిట్టూరి రంగమ్మ బరిలోకి దిగగా ఆమె అక్క అన్నెంపూడి కృష్ణకుమారి కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసి 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మామపై కోడలు విజయం

జగిత్యాల జిల్లా శ్రీరాంనగర్‌లో తాళ్లపెల్లి రాధిక 14 ఓట్ల తేడాతో తన మామ సత్యనారాయణగౌడ్‌పై విజయం సాధించింది.

Also Read :  రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్

అన్నా చెల్లెలు సర్పంచ్‌లే..

వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం వాల్యనాయక్‌ తండా సర్పంచ్‌గా నరసింహనాయక్‌ ఏక గ్రీవంగా ఎన్ని్కయ్యారు. కాగా ఆయన సోదరి కవిత ఆదివారం జరిగిన రెండో విడలతో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం హనిమ్యానాయక్‌ తండా సర్పంచ్‌గా గెలుపొందారు. అన్నా చెల్లెలు ఒకేసారి ప్రథమ పౌరులు కావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అత్తపై కోడలు విజయం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీనగర్‌ సర్పంచ్‌ స్థానానికి అత్త కోడలు పోటీ పడ్డారు. ఈ పోరులో సూర రమకు 874 ఓట్లు పడగా, ఆమె అత్త నర్సమ్మకు 856 ఓట్లు వచ్చాయి. దీంతో కోడలు రమ విజయం సాధించింది.

వదిన.. మరిది  నువ్వా నేనా!

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ పంచాయతీలో మాధవరపు వెంకటరమణారావు బరిలో నిలవగా ఆయన వదిన అదే కుటుంబానికి చెందిన మాధవరపు శ్రీలత పోటీ చేస్తున్నారు. ఇద్దరు ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ఇక్కడ వీరితోపాటు మరొకరు బరిలో ఉన్నారు. 

అమ్మమ్మతో మనవరాలు సవాల్‌

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో సర్పంచి ఎన్నికల్లో అమ్మమ్మ, మనవరాలు(బిడ్డ కుమార్తె) బరిలో నిలిచారు. అమ్మమ్మ సుల్తాన్‌ పోషమ్మకు ఓ ప్రధాన పార్టీ, మనవరాలు రాయపురం రమ్యకు మరో పార్టీ మద్దతిస్తున్నాయి. గతంలో పోషమ్మ సర్పంచిగా పనిచేశారు. ఈ స్థానాన్ని ఎస్టీ(మహిళ)కు రిజర్వ్‌ చేయగా గ్రామంలో నాలుగు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.

ఒకే ఇంటిలో మూడు పదవులు

జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వార్డు సభ్యులగా గెలుపొందారు. తుమ్మల నర్సమ్మ, ఆమె కుమారుడు గంగారాం, కోడలు అర్చన వార్డు సభ్యులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. 

Advertisment
తాజా కథనాలు