/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్(polling) ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామునే 7 గంటలకు పోలింగ్ బూత్‌ల తలుపులు తెరుచుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓటు వేసే అవకాశం ఉంది. తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఎన్నికల అధికారులు. 3వ దశలో నేడు 4,157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 53 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోడానికి 36,4 83 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 394 స్థానాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. - Local Body Elections 2025
Also Read : సిర్పూర్-యు అడవుల్లో 16 మంది నక్సల్స్ అరెస్ట్
రెండు గ్రామపంచాయతీ ఎన్నిలకపై కోర్టు స్టే..
మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది పోటీ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ సిబ్బంది అన్నీ ఏర్పాటుతో సిద్ధంగా ఉన్నారు. చాలా చోట్ల సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే తమ ఓటు వేసుకున్నారు. - local body elections update
Also Read : తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
Follow Us