Harassment: కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!

హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో చదువుతున్న పీజీ విద్యార్థినులను గర్ల్స్‌ హాస్టల్‌ మెస్ ఇన్‌ఛార్జ్‌ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

New Update
Harassment at Koti Women's College in Hyderabad

Harassment at Koti Women's College in Hyderabad

హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీ(Koti Women's College) లో వేధింపులు(Harassment) కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో చదువుతున్న పీజీ విద్యార్థినులను గర్ల్స్‌ హాస్టల్‌ మెస్ ఇన్‌ఛార్జ్‌ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు(sexual-abuse) ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) రంగంలోకి దిగారు. కోఠి ఉమెన్స్ కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. వినోద్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Also Read: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. కవిత సంచలన ప్రకటన

Harassment At Koti Women's College

మరోవైపు వినోద్ వేధింపులపై విద్యార్థినులు కూడా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఆడియో మెసేజ్‌లు పంపించారు. హాస్టల్‌లో ఉండాలంటే భయం వేస్తోందని.. వినోద్‌ వేధింపుల వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని యువతులు వాపోతున్నారు. ఇప్పటికే తాము ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశామని.. అయినప్పటికీ ఇంకా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్

Advertisment
తాజా కథనాలు