TG News: డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ
ప్రజాభవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు టీఎస్ఆర్టీసీ నుంచి అద్దె చెక్కులు అందజేశారు. సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు.