/rtv/media/media_files/2025/09/23/onion-and-garlic-2025-09-23-18-21-57.jpg)
Onion And Garlic
ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉల్లిపాయలు (Onions) వెల్లుల్లి (Garlic) ప్రధానమైనవి. ఇవి అలియం (Allium) జాతికి చెందినవి. ఉల్లిపాయలు ఆహారానికి ప్రత్యేకమైన తీపి, ఘాటు రుచిని, వెల్లుల్లి ఘాటైన వాసనను, రుచిని ఇస్తాయి. కూరలు, సూప్‌లు, సలాడ్‌లు, వివిధ రకాల మసాలా దినుసుల తయారీలో ఈ రెండింటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాటిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో కూడా వీటిని విరివిగా వాడతారు. ప్రతి వంటగదిలోనూ తప్పనిసరిగా ఉండే ఈ దినుసులు ఆహారానికి అద్భుతమైన రుచిని, సుగంధాన్ని అందిస్తాయి. అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని ఆహారం చాలామందికి రుచించదు. కానీ వాటి వాసన నోటిలో చాలాసేపు ఉండిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ చెడు వాసన వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఉల్లి, వెల్లుల్లి దుర్వాసనకు చెక్ పెట్టె చిట్కాలు:
యాలకులు:
యాలకులు (Cardamom) నోటి దుర్వాసనను పోగొట్టడానికి యాలకులు నమలడం ఒక సులభమైన మార్గం. ఇది నోటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గోరువెచ్చని నీరు:
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
సోంపు:
సోంపు (Fennel) భోజనం తర్వాత సోంపు గింజలు నమలడం వల్ల ఉల్లిపాయలు, వెల్లుల్లి వాసన సులభంగా పోతుంది. సోంపులో ఉన్న సువాసన వాసనను కప్పివేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడంలో తోడ్పడుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల నోరు తాజా అనుభూతిని పొందుతుంది.. దుర్వాసన తగ్గుతుంది.
నాలుకను శుభ్రం:
నోటి శుభ్రతలో నాలుకను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ భోజనం తర్వాత నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల దానిపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఆహార పదార్థాల అవశేషాలు తొలగిపోతాయి. దీని వల్ల దుర్వాసన తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఉల్లి, వెల్లుల్లి వాసన నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: అస్తమానం టాయిలెట్‌కి పరుగులు పెడుతున్నారా..? దానికి ఆయుర్వేద పరిష్కారం ఏమిటో తెలుసుకోండి!!