/rtv/media/media_files/2025/09/24/taking-a-shower-2025-09-24-20-53-38.jpg)
Taking a shower
నేటి కాలంలో ఒత్తైన, నిగనిగలాడే జుట్టు అందరికి ఇష్టంగానే ఉంటుంది. దీని కోసం చాలామంది షాంపూలను ఆశ్రయిస్తుంటారు. షాంపూలు జుట్టును మెత్తగా, కాంతివంతంగా చేస్తాయి. కానీ ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంది. తరచుగా జుట్టు కడగడం వల్ల జుట్టు రాలడం పెరిగి.. పొడిగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ జుట్టును కడుక్కునే అలవాటు ఉంటే అది జుట్టుకు ఎలా హాని కలిగిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రోజువారీ తలస్నానం:
షాంపూ జుట్టును శుభ్రం చేసినప్పటికీ.. ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు తేమను కోల్పోయి, పెళుసుగా మారి రాలడం పెరుగుతుంది. పొడి జుట్టు ఉన్నవారు వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. అదే జిడ్డుగల స్కాల్ప్ ఉన్నవారు వారానికి మూడుసార్లు తలస్నానం చేయవచ్చు. అవి కచ్చితమైన జుట్టు రకానికి సరిపోయే చిట్కాలు. పొడి జుట్టు ఉన్నవారు తరచుగా షాంపూ వాడటం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోయి మరింత పొడిగా మారుతుంది. అందుకే వీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. జిడ్డుగల జుట్టు ఉన్నవారు ఎక్కువసార్లు తలస్నానం చేయవచ్చు. కానీ అది వారానికి మూడుసార్లకు మించకూడదు. ముఖ్యంగా మెలికలు తిరిగిన (కర్లీ) జుట్టు ఉన్నవారు వారానికి ఒకట లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి.
ఇది కూడా చదవండి: మచ్చలేని చర్మం కోసం ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం వల్ల జుట్టు పొడిగా మారే అవకాశం ఉంది. జుట్టు సంరక్షణకు హెయిర్ మాస్క్‌లు ఎంతో సహాయపడతాయి. హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టును మృదువుగా మార్చడానికి గుడ్డు లేదా అరటిపండుతో చేసిన మాస్క్ ఉపయోగించవచ్చు. అరటిపండు, అలోవెరా జెల్ కలిపి పేస్ట్ చేసి జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పద్ధతితో జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. నిత్యం తలస్నానం చేసే అలవాటు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించడం ద్వారా తమ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మనిషికి ఒకటి కాదు రెండు గుండెలు ఉంటాయని మీకు తెలుసా? అది ఎంత కీలకమంటే?