AP Crime: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. మృతులు ముసేటి విష్ణువర్ధన్ (9), మనుబోటి నవశ్రావణ్‌(12)గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Nellore Crime News

Nellore Crime News

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన 9 ఏళ్ల ముసేటి విష్ణువర్ధన్, 12 ఏళ్ల మనుబోటి నవ శ్రావణ్‌లు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిన్నారులు మృతి:

పోలీసులు ఈ రోజు ఉదయం నుంచీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు, పోలీసు జాగిలాల సహాయంతో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని ఒక చెరువు కుంటలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధించారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది.

ఇది కూడా చదవండి: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారుల మృతికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో ఉయ్యాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటనపై కలువాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: న్యాయం కోసం వెళ్తే కాటేసిన పోలీసు కామాంధులు!

Advertisment
తాజా కథనాలు