Amazon- Flipkart Offers: ఇవేం ఆఫర్లు రా బాబు.. రూ.10 వేలలోపు ధరతో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పండగ సేల్ స్టార్ అయ్యింది. ఈ సేల్ లో  మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి హై ఎండ్ ఫీచర్లు కలిగిన  ఖరీదైన ఫోన్లు కూడా తక్కువ బడ్జెట్ కే అందుబాటులో ఉన్నాయి.

New Update
mobile offers

mobile offers

Amazon, Flipkart Offers: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పండగ సేల్ స్టార్ అయ్యింది. ఈ సేల్ లో  మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి హై ఎండ్ ఫీచర్లు కలిగిన  ఖరీదైన ఫోన్లు కూడా తక్కువ బడ్జెట్ కే అందుబాటులో ఉన్నాయి. రూ. 10, 000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. వీటిలో 5G కనెక్టివిటీ మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి మొబైల్ ఫోన్స్ కొనాలని అనుకుంటున్నవారికి ఈ సేల్ మంచి డీలింగ్స్ అందిస్తోంది. రూ. 10, 000 కంటే తక్కువ బడ్జెట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇక్కడ చూద్దాం.. 

రూ. 10, 000 కంటే తక్కువ బడ్జెట్

POCO M7 5G

అద్భుతమైన ఫీచర్స్ కలిగిన పోకో M7 5G అమెజాన్ లో కేవలం రూ. 8,499కి లభిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. రిఫ్రెష్ రేట్‌ 120Hz , డిస్ ప్లే సైజ్ 6.8,    6GB RAM, 128 GB స్టోరేజ్, 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. కేవలం 10వేల లోపే ఇంత మంచి డీల్ అందుబాటులో ఉంది. 

 Lava Blaze 2 5G

5G కనెక్టివిటీకలిగిన లావా బ్లేజ్ 2 5G అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ.8,899 కే అందుబాటులో ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 6.56-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే కలిగి ఉంది. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో  50MP ప్రైమరీ సెన్సార్, అలాగే ముందు భాగంలో 8MP లెన్స్ తో డ్యూయల్ కెమెరా అందుబాటులో ఉంది.   5,000mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్  ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు ఈ మోడల్ ఫోన్ లో రెండు రకాల స్టోరేజ్ టైప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి 4GB RAM విత్ 64GB స్టోరేజ్,  రెండవది  6GB RAM విత్ 128GB స్టోరేజ్. 

రెడ్‌మి A4

రెడ్‌మి A4 ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 8, 293కే అందుబాటులో ఉంది. దీని ఫీచర్స్ కూడా బెస్ట్ గా ఉన్నాయి. రెడ్‌మి A4  120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌, 6.8-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో  4GB RAM,  64GB  స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం  మైక్రో SD కార్డ్ ఇందులో ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ సైజ్ 5160mAh , బ్యాక్ కెమెరా విత్ కెమెరా 50MP, ఫ్రంట్ విత్ 5MP తో లభిస్తోంది. 

మోటరోలా G05

గతేడాది లాంచ్ అయిన ఈ  మోడల్ ప్రీమియం డిజైన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం 6,999 కే అందుబాటులో ఉంది. 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 4GB RAM, 64GB స్టోరేజ్‌, 50MP బ్యాక్ కెమెరా, 5,200mAh, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కలిగి ఉంది. 

Also Read: 71st National Film Awards 2025: డైరెక్టర్ సుకుమార్ కూతురి సత్తా.. తొలి సినిమాతో నేషనల్ అవార్డు

Advertisment
తాజా కథనాలు