Glass skin: కొరియన్ గ్లాసీ లుక్ కోసం ఈ ఇంటి చిట్కా ఫాలో అవ్వండి

గ్లాస్ స్కిన్ అంటే లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండి.. బయట నుంచి కాంతివంతంగా, మృదువుగా మెరుస్తున్న చర్మం. ఇంటి చిట్కాలతో గ్లాస్ స్కిన్ పొందవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తక్కువ ఖర్చుతో గ్లాస్ స్కిన్ ఎలా పొందాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
korean skin glowing

korean skin glowing

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొరియన్ బ్యూటీ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్లాస్ స్కిన్ అనేది చాలా మందికి ఒక కలలా మారింది. గ్లాస్ స్కిన్ అంటే లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండి.. బయట నుంచి కాంతివంతంగా, మృదువుగా మెరుస్తున్న చర్మం. దీన్ని పొందడానికి చాలా మంది వేలకు వేలు ఖర్చు పెట్టి సీరమ్‌లు, కెమికల్ ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. కానీ ఇంటి చిట్కాలతో కూడా గ్లాస్ స్కిన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ స్కిన్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గ్లాస్ స్కిన్ కోసం.. 

రాత్రిపూట ఓ గిన్నె బియ్యాన్ని నానబెట్టి. ఉదయం దాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి.. ఆ పేస్ట్‌ను ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత దాన్ని 15-20 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒకటి రెండు నెలల్లో  చర్మంలో మంచి మార్పు కనిపిస్తుంది.

బియ్యం నీరు:

బియ్యం నీరు చర్మానికి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఒక గిన్నె బియ్యాన్ని 4-5 సార్లు కడిగి అందులో 2-3 కప్పుల నీరు పోసి 10-12 గంటలు నానబెట్టాలి. తర్వాత దాన్ని వడపోసి ఓ స్ప్రే బాటిల్‌లో పోసి పెట్టుకోవాలి. రోజుకు రెండు సార్లు దీన్ని ముఖంపై స్ప్రే చేయాలి.

 ఇది కూడా చదవండి: అస్తమానం టాయిలెట్‌కి పరుగులు పెడుతున్నారా..? దానికి ఆయుర్వేద పరిష్కారం ఏమిటో తెలుసుకోండి!!

కలబంద జెల్‌:

కలబంద జెల్ చర్మం, జుట్టుకు చాలా మంచిది. గ్లోయింగ్ స్కిన్ కోసం కలబంద జెల్‌లో విటమిన్ ఇ జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు నైట్ క్రీమ్‌లా వాడాలి. ఇలా నెల చేస్తే చర్మంపై మచ్చలు తగ్గి.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ సులభమైన ఇంటి చిట్కాలతో  ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తక్కువ ఖర్చుతో గ్లాస్ స్కిన్ పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించి అందమైన.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: తిన్న తర్వాత ఉల్లి వెల్లుల్లి వాసన నోటి నుంచి రావొద్దంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Advertisment
తాజా కథనాలు