Instagram Reels: రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యమునా నదిలోకి దిగిన ఆరుగురు యువతులు మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు ప్రయత్నించిన ఐదుగురు కూడా కొట్టుకుపోయారు. వీరంతా ఒక్కే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.