French woman Raped: ‘ప్లీజ్ నన్ను వదిలెయ్’.. అందమైన ప్రదేశాలు చూపిస్తానని ఫ్రెంచ్‌ మహిళపై రేప్

భారత పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్‌ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఉదయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. ఓ పార్టీకి హాజరైన మహిళను నిందితుడు సిద్ధార్థ్ తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేశారు.

New Update
_French woman raped in Udaipur, Jaipur

French woman raped in Udaipur, Jaipur

భారత్‌లో ఫ్రెంచ్ మహిళ రేప్‌కు గురైంది. ఇక్కడ ఉండే అందమైన ప్రదేశాలను, అద్భుతమైన లొకేషన్లను సందర్శించేందుకు ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చిన ఆ మహిళపై సిద్ధార్థ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఓ పార్టీకి వెళ్లిన ఆ ఫ్రెంచ్ మహిళను.. అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జైపూర్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

 French woman raped

ఫ్రెంచ్ మహిళ సోమవారం ఢిల్లీ నుంచి ఉదయ్‌పుర్‌కి వచ్చింది. అనంతరం అంబమాత ప్రాంతంలోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని అక్కడే బసచేసింది. అదే రోజు రాత్రి గ్రీక్‌ ఫార్మ్‌ కేఫ్, టైగర్‌ హిల్‌ సమీపంలోని రెస్ట్రోలో జరుగుతున్న పార్టీలో పాల్గొంది. అక్కడే సిద్ధార్థ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు ఆ మహిళకు మాయమాటలు చెప్పాడు. 

అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూపిస్తానని నమ్మించాడు. అనంతరం తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే తాను హోటల్‌లో రూమ్ తీసుకున్నానని.. తనను అక్కడకు పంపించాలని ఆ మహిళా బాధితురాలు ఎంతో వేడుకుంది. 

పలుమార్లు బతిమాలింది. అయినా ఆ నిందితుడు అందుకు అంగీకరించలేదు. అనంతరం ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో హాస్పిటల్‌లో చేరిన ఆ మహిళ.. అనంతరం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం నిందితుడు సిద్ధార్థ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు