Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైపోయిన యజమాని, ఉద్యోగి
నాగ్పూర్ లోని మహల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వస్తువుల గిడ్డంగిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను గిడ్డంగి యజమాని గిరీష్ ఖత్రి, ఉద్యోగి విఠల్ ధోటేగా గుర్తించారు.