/rtv/media/media_files/2025/06/29/uttar-pradesh-14-year-old-boy-raped-seven-year-old-girl-2025-06-29-12-56-21.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అరెస్టు చేసి కరెక్షనల్ హోమ్‌కు పంపించారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
ఏడేళ్ల బాలికపై అత్యాచారం
ఏడేళ్ల బాలిక తన ఇంటి సమీపం నుంచి నీరు తీసుకురావడానికి వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడంతో అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తండ్రితో చెప్పింది. దీంతో అతడు నిందితుడి తండ్రికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిందితుడు తండ్రి.. బాధిత బాలికను చంపేస్తానని బెదిరించాడు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
దీంతో బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు, అతడి తండ్రిపై కేసు నమోదు చేశారు. అనంతరం బాల నేరస్థుడ్ని కరెక్షనల్ హౌమ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడి తండ్రి కోసం గాలిస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ (ఖుర్జా) పూర్ణిమ సింగ్ తెలిపారు. త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు.
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : జపాన్‌లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి