/rtv/media/media_files/2025/06/24/one-sided-love-revenge-and-bomb-blast-hoaxes-mnc-consultant-vendetta-ends-in-her-arrest-2025-06-24-07-43-45.jpg)
one sided love revenge and bomb blast hoaxes mnc consultant vendetta ends in her arrest
ఓ మహిళ టెకీ ఓ యువకుడిని ఎంతగానో ప్రేమించింది. అది కూడా వన్ సైడ్ లవ్. అతడిని చూసి మురిసిపోతూ ఉండేది. ఇంతలో అతడికి వేరే మహిళతో పెళ్లి సెట్ అయింది. మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. దీంతో అతడు వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో ఆ మహిళా టెకీ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ప్రియుడ్ని ఇరికించిన ప్రేయసి
దీంతో అతడి పేరుతో ఈ-మెయిల్స్ క్రియేట్ చేసి పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు పంపించింది. అనంతరం తన ఆచూకీ దొరకకుండా జాగ్రత్త పడింది. అయినప్పటికీ చివరికి సైబర్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైంది.
Also Read: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
అందిన సమాచారం ప్రకారం.. రెనే జోషిల్డా అనే మహిళ చెన్నైలోని ఓ MNC కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తితో వన్ సైడ్ ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవించాలనుకుంది. ఇంతలో అతడు వేరే మహిలను పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయింది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఎలాగైనా అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే అతడి పేరు, ఇతర సమాచారంతో ఈ-మెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, VPN ద్వారా తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, నరేంద్ర మోదీ స్టేడియం, బీజే మెడికల్ కాలేజీ, రెండు స్కూల్స్ సహా మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు పంపించింది.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
ఈ మెసేజ్‌లపై ఓ పాఠశాల యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే సైబర్ పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ఆ యువతి తన గుర్తింపు, లోకేషన్ బయటపడకుండా చాలా తెలివిగా వ్యవహరించినప్పటికీ.. చిన్న మిస్టేక్ చేసి దొరికిపోయిందని తెలిపారు.
Latest crime news | crime news