Girl Raped: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

యూపీలోని ఫిరోజాబాద్‌‌లో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటి పరిసరాల్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని 25 ఏళ్ల యువకుడు పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో ఆమెను బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
uttar pradesh firozabad Rape Of 10 Year Old Girl

uttar pradesh firozabad Rape Of 10 Year Old Girl

ఇంటి పరిసరాల్లో ఆడుకోవడానికి వెళ్లిన పదేళ్ల బాలికను 25 ఏళ్ల యువకుడు రేప్ చేశాడు. ఆమెను పొలంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై చిన్నారికి రక్తస్రావం కావడంతో.. ఆమెను బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

పొలాల్లోకి తీసుకెళ్లి రేప్

ఉత్తర ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌‌లోని షికోహాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మొహల్లాలో బాలిక ఫ్యామిలీ నివశిస్తుంది. ఆమె రాత్రి 7 గంటలకు ఇంటి పరిసరాల్లో ఆడుకోవడానికి వెళ్లింది. దీంతో చిన్నారిని ఒంటరిగా చూసిన 25 ఏళ్ల షాజాద్.. ఆమెను పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

బాలిక దుస్తులకు బ్లడ్ అంటుకోవడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు ఆమెను బెదిరించాడు. బాధితురాలు ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఫ్యామిలీ.. చిన్నారిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ పోలీసులు బాలికను చికిత్స కోసం ట్రామా సెంటర్‌కు పంపారు. అనంతరం నిందితుడు షాజాద్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు