Malakpet Gun Firing: మలక్‌పేటలో కాల్పులు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్!
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
అస్సాంలోని గువాహటిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 38 ఏళ్ల మహిళ తన భర్తను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జాయ్మతి నగర్, పండు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన జూన్ 26న చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎత్తుకెళ్లారు. జూలై 8న పార్క్ చేసిన ట్రాక్టర్ మరుసటి రోజు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని హసన్‌కు చెందిన అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) అనే ముగ్గురు యువకులు పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వసంత విహార్‌లో జూలై 9న వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా, ఉదయ్‌గఢ్ గ్రామంలో ఒక తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకున్నందుకు గానూ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం రేపింది. తమ సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాదని, కుటుంబ పరువు పోయిందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐఐఎం-కలకత్తా బాలుర హాస్టల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిలింగ్ కోసం హాస్టల్‌కు పిలిచి, మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అప్పుల వివాదం చిలికి చిలికి గాలివానైంది. అప్పుల చెల్లింపు విషయమై భార్యాభర్తలైన విద్యా, విజయ్ మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త విజయ్, భార్య విద్యా ముక్కును కొరికేశాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.