Car Accident: కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో!

ఢిల్లీలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వసంత విహార్‌లో జూలై 9న వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

New Update
vasant vihar audi crushed 5 people who were sleeping on the footpath

vasant vihar audi crushed 5 people who were sleeping on the footpath

ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. వసంత విహార్ ప్రాంతంలో బుధవారం (జూలై 9) తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక 8 ఏళ్ల బాలికతో సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

కారు బీభత్సం

మునిర్కా ఫ్లైఓవర్ సమీపంలోని శివా క్యాంప్ వద్ద రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన లధి (40), ఆమె 8 ఏళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35) ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 1:30 నుండి 1:45 గంటల మధ్య ద్వారకకు చెందిన 40 ఏళ్ల ఉత్సవ్ శేఖర్ అనే ప్రాపర్టీ డీలర్ నడుపుతున్న ఆడి కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో నిద్రిస్తున్న వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లి నిలిపి ఉంచిన ఒక ట్రక్కును ఢీకొని ఆగిపోయింది. 

Also Read :  ఏపీలో గుండెపగిలే విషాదం.. దేవుని దర్శనం కోసం వచ్చి అనంతలోకాలకు

ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద శబ్దం విని స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అంబులెన్స్ సేవలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు నిందితుడైన కారు డ్రైవర్ ఉత్సవ్ శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో అతను మద్యం సేవించి కారు నడిపినట్లు నిర్ధారణ అయింది. నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవింగ్ చేసి గాయాలకు కారణమైనందుకు అతనిపై కేసు నమోదు చేశారు. 

Also Read :  'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

Also Read :  కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో!

Latest crime news | crime news | Car Accident

Advertisment
Advertisment
తాజా కథనాలు