New Update
/rtv/media/media_files/2025/07/15/malakpet-gun-firing-2025-07-15-08-31-33.jpg)
Malakpet Gun Firing
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న (జూలై 14) జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
శాలివాహన నగర్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తున్న వారిపై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చందు నాయక్ అనే వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా కథనాలు