/rtv/media/media_files/2025/07/11/karnataka-husband-bites-wife-nose-2025-07-11-20-19-29.jpg)
Karnataka Husband Bites Wife Nose
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పులు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ చివరకు తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆ కోపంలో భర్త తన భార్య ముక్కును కొరికివేశాడు. ఈ ఘటన ఇవాళ (శుక్రవారం) వెలుగులోకి వచ్చింది.
Also Read: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
కోపంలో భార్య ముక్కు కొరికేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవణగిరి జిల్లా, చన్నగిరి తాలూకా, మంతరఘట్ట గ్రామానికి చెందిన విద్యా (30), ఆమె భర్త విజయ్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పుల చెల్లింపు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విద్యా తీసుకున్న రుణానికి విజయ్ హామీగా ఉన్నాడు. అయితే విద్యా వాయిదాలు చెల్లించడంలో విఫలం కావడంతో అప్పు ఇచ్చిన వారు భార్యాభర్తలను వేధించడం మొదలెట్టారు.
Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
ఈ నేపథ్యంలో మంగళవారం (జూలై 8) మధ్యాహ్నం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం పెరిగి గొడవకు దారితీయగా, విద్యా కింద పడిపోయింది. ఆవేశంలో ఉన్న విజయ్, విద్యా ముక్కును కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు చివర భాగం తెగిపోయింది.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, విద్యాని శివమొగ్గలోని మెగ్గన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై విద్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా, శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసును దేవణగిరి జిల్లాలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విజయ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.