/rtv/media/media_files/2025/07/12/father-tribute-to-his-daughter-after-daughter-love-marriage-2025-07-12-15-18-32.jpg)
father Tribute to his daughter after daughter love marriage
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా ఉదయ్‌గఢ్ గ్రామంలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి బతికి ఉన్న తన కూతురుకి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆ అంత్యక్రియల్లో బంధువులు సైతం పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
బతికున్న కూతురికి శ్రద్ధాంజలి
అలీరాజ్‌పూర్ జిల్లాలోని ఉదయ్‌గఢ్ గ్రామంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి అదే గ్రామానికి చెందిన మరొక వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి చేసిన పనికి ఆ కుటుంబం తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆ అమ్మాయి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమ కూతురు వేరే వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.. వారితో ఉన్న అన్ని సంబంధాలను ఆ కుటుంబం తెంచుకుంది.
अलीराजपुर जिले के उदयगढ़ ग्राम से एक हैरान कर देने वाला मामला सामने आया है। यहां पिता ने अपनी जीवित बेटी का मृत्यु कार्यक्रम विधि विधान से किया। रिपोर्ट के मुताबिक, इस लड़की ने दूसरे समाज के लड़के से शादी कर ली थी। pic.twitter.com/XACti84Dil
— Shabnaz Khanam (@ShabnazKhanam) July 12, 2025
బతికున్న తన కూతురికి తమ ఆచారాల ప్రకారం తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. బంధువులు, స్నేహితులు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. సొసైటీ సమక్షంలో జరిగిన శ్రాద్ధోత్సవంలో ఆ అమ్మాయి ఫోటోను ఉంచారు. ఫోటోపై ఆమె మరణించిన తేదీ రాసి పెట్టారు (ఈ తేదీ ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లిన రోజు).
Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!
ఈ విషయంపై అమ్మాయి తండ్రి చందన్ సింగ్ పన్వర్ మాట్లాడుతూ.. జూలై 3న పరీక్ష రాయడానికి ఝబువా వెళ్తున్నానని చెప్పి తన కూతురు ఇంటి నుండి వెళ్లిపోయిందని, తిరిగి ఆమె ఇంటికి రాలేదని తెలిపాడు. తమ సమాజంలో ఇలాంటి ప్రేమ వివాహాలు ఆమోదయోగ్యం కాదని, తమ కూతురు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కుటుంబానికి పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ కుటుంబంలోనూ ఇలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!