BREAKING: నారాయణరెడ్డి హత్య కేసు.. 11 మందికి యావజ్జీవ శిక్ష
కర్నూలు మాజీ ఎమ్మెల్యే భర్త కంగాటి లక్ష్మీనారాయణరెడ్డి, అతని అనుచరుడు హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
నాకు న్యాయం చేయండి.. ప్రియుడు ఇంటి ముందు హిజ్రా నిరసన దీక్ష
ఆదోనికి చెందిన గణేష్ ఓ ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. తనని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని మోసం చేశాడని ఆ ట్రాన్స్జెండర్ ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయమని కోరింది.
South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !
ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.