BIG BREAKING: కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక మలుపు.. బస్సు యజమాని వేమూరి అరెస్టు

కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

New Update
BREAKING

BREAKING

కర్నూలు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై పడి ఉన్న ఓ బైక్‌ను వేమూరి ట్రావెల్స్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్‌, యజమానిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇందులో ఏ1గా డ్రైవర్‌ లక్ష్మయ్యను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ బస్సుపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ కావేరి ట్రావెల్స్ బస్సుపై చలానాలు ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కొన్ని తప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సీటర్ బస్సును స్లీపర్‌గా మార్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు బస్సు డ్రైవర్‌తో పాటు యజమానిపై కూడా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Bomb Threat Calls: బాంబులు పెట్టానంటూ బెదిరింపు కాల్స్‌.. కట్‌ చేస్తే విఫల ప్రేమికురాలు

ఇది కూడా చూడండి: RTC Bus Accident: మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. స్పాట్‌లో ..

Advertisment
తాజా కథనాలు