ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్‌లో చోటుచేసుకుంది. ల్యాబ్‌లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో అరుణ గర్భం దాల్చడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది.కృపాసాగర్ నుంచి 5లక్షలు లాగేసింది అరుణ..మూడునెలల క్రితం మరో యువతితో కృపాసాగర్ పెళ్లి జరిగింది.
మరోసారి తాను గర్భిణీ అంటూ
అయితే మరోసారి తాను గర్భిణీ అంటూ దానికి కృపాసాగర్ కారణం అంటూ ల్యాబ్ వద్ద గొడవకు దిగింది అరుణ. అయితే మహిళ వేధింపులు భరించలేక ఇంట్లోనే తనువు చాలించాడు కృపాసాగర్. డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయడమే కారణమంటూ కుటుంబ సభ్యులు అరుణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కూడా తన భర్త కృపాసాగర్ తనువు చాలించినట్లుగా అతని భార్య పోలీసులకు వెల్లడించారు. అరుణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Follow Us