/rtv/media/media_files/2026/01/25/kurnool-2026-01-25-07-05-27.jpg)
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు. మహబూబాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఏపీలోనూ చోటుచేసుకుంది.
ఒక యువతి తన మాజీ ప్రియుడిపై పగ పెంచుకొని అతని భార్యకు ప్రాణాంతకమైన వైరస్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన వసుంధర అనే యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమాను తలపించేలా సాగిన ఈ క్రైమ్ స్టోరీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2026
ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన మాజీ ప్రియురాలు
కర్నూలులో స్కూటీపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ప్రియుడు కరుణ్ కుమార్ భార్య శ్రావణికి సహాయం పేరుతో, వైరస్ ఇంజెక్షన్ చేసిన మాజీ ప్రియురాలు వసుంధర
వసుంధరతో పాటు ఆమెకు సహాయం చేసిన… pic.twitter.com/Sppw9TivHh
ఇంతకు ఏం జరిగిందంటే..
కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణ్ కుమార్ అనే వ్యక్తికి వసుంధరతో గతంలో పరిచయం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల వారి బంధం తెగిపోవడంతో కరుణ్ కుమార్... శ్రావణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర, ఎలాగైనా శ్రావణిని అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే శ్రావణి స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర. వారు బైకు మీది నుంచి పడిపోయాక సాయం చేస్తున్నట్లు నటించి ఆమె దగ్గరకు చేరింది వసుంధర.
మరో ముగ్గురు వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్ ఇంజెక్షన్‌తో దాడి చేసింది. అయితే బాధితురాలు శ్రావణి గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. శ్రావణిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న శ్రావణి భర్త కరుణ్ కుమార్.. వసుంధరపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరా పుటేజి ఆధారంగా.. వసుంధరతో పాటుగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
Follow Us