/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
కర్నూలు బస్సు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టానికి దారి తీసింది. 20 మంది ప్రయాణికులు చనిపోయారు. బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. మొదట బస్సు బైక్‌ను ఢీకొట్టింది. అప్పుడే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి..పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బైక్ బస్సు కింద చిక్కుకుని కొంత దూరం పాటూ లాక్కుని వెళ్ళింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగాయి. వాటికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభం అయ్యాయి. అవి లగేజ్ ప్లేస్ వరకు వ్యాపించాయి. అక్కడ 400 వందలకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ల పార్సిల్ ఉంది. వాటికి మంటలు అంటుకుని, బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు ఎక్కువ అయ్యాయి. అవి ప్రయాణికుల కంపార్టెమెంట్ వరకు వ్యాపించాయి. వాళ్ళకు తప్పించుకునే సమయం లేకుండా అయిపోయింది. దానికి తోడు బస్సు మెయిన్ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగులకొట్టుకుని కొంతమంది తప్పించుకున్నారు. కానీ కొంత మంది మాత్రం మంటలకు ఆహుతి అయిపోయారు. బస్సుకు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా మరణించారు.
డ్రైవర్, యజమానిపై కేసు..
ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిని ఫైల్ చేశారు. ఇందులో ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై BNS 125(a), 106(1) అనే రెండు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
విచారణలో షాకింగ్ నిజాలు..
ఈ విషాద ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ బైక్ బస్సు కింద పడి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు బస్సులో భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. ఆ బైక్ ఎలా వచ్చింది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో బైక్ నడిపిన శివశంకర్ వెనుక కూర్చున్న అతని ఫ్రెండ్ ఎర్ర స్వామి పోలీసులకు వివరించాడు. ప్రమాద స్థలానికి 3 కి.మీ ముందు పెట్రోల్ బంక్‌లో శివశంకర్, ఎర్రస్వామి కలిసి బైక్‌పై ప్రయాణించిన సీసీఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎర్రస్వామిని విచారించారు. మొత్తం రెండు ప్రమాదాలు జరిగినట్లు ఎర్రిస్వామి తెలిపాడు. బస్సు స్పాట్‌కు రాకముందే శివశంకర్ ఢీవైడర్‌ని ఢీకొట్టి స్పాట్‌లో చనిపోయాడు. దీంతో రోడ్డుకు అడ్డంగా పడ్డ బైక్‌ను ఎర్ర స్వామి పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. Vకావేరి బస్సు తొసుకెళ్లిందని-- శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి చెప్పాడు. ఈ ప్రమాదంలో ఎర్రిస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తేల్చి చెప్పారు.
Also Read: Bengaluru: వివాహేతర సంబంధాల్లో బెంగళూరు నెంబర్ వన్..టాప్ 5లో ఈ నగరాలు..
Follow Us