BIG BREAKING: కర్నూలులో మరో భారీ అగ్ని ప్రమాదం!

కర్నూలు జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదం విషయం మరిచిపోకముందే జిల్లాలోని ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు.

New Update
Fire Accident

Fire Accident

 BIG BREAKING:  కర్నూలు జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదం విషయం మరిచిపోకముందే జిల్లాలోని ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. ఉదయం 6 గంటల సమయంలో వేరుశనగ గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో రూ.10 లక్షల విలువైన ధాన్యం ఖాళీ సంచులు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అగ్ని్మాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. భారీ ఆస్తినష్టం వాటిల్లినప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి: ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు