Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. శివశంకర్ వెనుక కూర్చున్న టామీ ఎక్కడ?

రికార్డ్ అయిన వీడియోల్లో బైకుపై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను శివశంకర్ స్నేహితుడు స్వామి అలియాస్ టామీ అని సమాచారం.

New Update
tommy 1233

కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన 19 మంది ప్రయాణికులతో పాటు బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. కర్నూలు పట్టణంలోని ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ కు చెందిన బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో పెట్రోల్ లీకై, బస్సులో మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. దీంతో వేగంగా మంటలు వ్యాపించాయి. వెంటనే కొంతమంది విండోస్ విరగొట్టి బయటకు రాగా,  మరికొంతమంది అందులోనే చిక్కుకుపోయి చనిపోయారు. 

అయితే ప్రమాదం జరగడానికి ఓ 20 నిమిషాల ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంకులో ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో శివశంకర్ ఒక్క చేతితో బైకును తిప్పుతూ విన్యాసాలు చేయడం.. తూలుతూ కనిపించడంతో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అంతేకాకుండా బైకును కూడా చాలా రాష్ గా నడిపినట్లు ఆ వీడియోలో స్పష్టం అవుతోంది. 

టామీ ఎక్కడ?  

రికార్డ్ అయిన వీడియోల్లో బైకుపై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను శివశంకర్ స్నేహితుడు స్వామి అలియాస్ టామీ అని సమాచారం. వీడియోలో టామీ బ్యాగ్ తగిలించుకొని కనిపించాడు. అతను ఇప్పుడు ఏం అయ్యాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..  టామీ ప్రమాదం జరిగే ముందు ఎక్కడైనా దిగిపోయాడా? లేదంటే అతను కూడా ప్రమాదానికి గురయ్యాడా? అన్నది తెలియాల్సి ఉంది. టామీ ఎక్కడున్నాడో, ఏమైయ్యాడో తెలిస్తే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

ఇద్దరు కలిసి ఏమైనా మద్యం సేవించారా లేదా..  రేపు ఎంగేజ్ మెంట్ అంటే ఆ రోజు రాత్రి శివశంకర్ ఎందుకు బయటకు వచ్చాడనే దానిపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పోలీసుల విచారణలో, తాము బైక్‌ను ఢీకొట్టలేదని, బైక్ ఇప్పటికే ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉందని, దానిని తప్పించే క్రమంలో బైక్ తమ బస్సు కింద ఇరుక్కుపోయిందని చెబుతున్నాడు.

Advertisment
తాజా కథనాలు