గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉంది : కేటీఆర్
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ అన్ని అబద్దాలు, అర్థ సత్యాలే మాట్లాడారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కూడా రుణమాఫీ జరగలేదన్నారు.