/rtv/media/media_files/2025/03/01/iEs8yfh5YSGNehHQyrrX.jpg)
ktr vs revanth reddy
కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని.. వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని.. ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ తెలిపారు.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
ఇది కూడా చూడండి:Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Revanth Reddy vs KTR
ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను కేటీఆర్ అడుగుతున్నారు. దానికి కేసీఆర్ అంగీకరించడం లేదు. దానితో వారి కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. సొంత వివాదాలతోనే ఆ కుటుంబానికి సరిపోతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదు. కేదార్ అనే వ్యక్తితో కలిసి కేటీఆర్ దుబాయ్‌లో డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడు. ఆయన మరణంపై పూర్తినివేదిక ఉంది. మద్యంలో కాక్‌టెయిల్ విన్నాం.. డ్రగ్స్‌లో తొలిసారి కాక్‌టెయిల్ అని వింటున్నాం. అవసరమైనప్పుడు కేదార్ మరణానికి గల కారణాల రిపోర్టును బయటపెడతాం. ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమే. నేను చర్చిస్తానంటోంది ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో మాత్రమే.. కేటీఆర్‌తో కాదు అని సీఎం స్పష్టం చేశారు.
Also Read:తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
Also Read: పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
ktr | dubai | hyderabad-drugs-case | drugs-case | ktr vs cm revanthreddy | cm-revanthreddy