KTR: హిందీ భాష వివాదం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో 22 అధికారిక భాషలు, 300 అనాధికార భాషలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. తాము ఎవరిపై కూడా తెలుగు భాషను రుద్దనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతరులపై ఎందుకు హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని ప్రశ్నించారు.

New Update
KTR

KTR

హిందీ భాష వివాదం దేశంలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు సీఎం విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల మహారాష్ట్రలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. హిందీ భాషకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

Also Read: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్

భాష అనేది కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదని సంస్కృతికి కూడా ఒక గుర్తింపు లాంటిదని కేటీఆర్‌ అన్నారు. దేశంలో 22 అధికారిక భాషలు, 300 అనాధికార భాషలు ఉన్నట్లు పేర్కొన్నారు. తాము ఎవరిపై కూడా తెలుగు భాషను రుద్దనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతరులపై ఎందుకు హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) గురించి కూడా ఆయన మాట్లాడారు. 

Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదని తెలిపారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దన్నారు. ప్రస్తుతం బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని తెలిపారు. రాజకీయలబ్ధీ కోసం విద్వేషాలు సృష్టించడం చాలా ఈజీ అని.. ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేయకుంటే అంతా బాగుందని అనుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు