/rtv/media/media_files/2024/12/12/Hn3HvCeLoLoMW97dEbWk.jpg)
Forensic auditing
‘ధరణి’పోర్టల్‌ద్వారా జరిగిన అనుమానస్పద భూ లావదేవీలపై ప్రభుత్వం దృష్టి సారించింది.లావాదేవీల నిగ్గు తేల్చేందుకు త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం సిద్ధిపేట,సిరిసిల్ల జిల్లాలను ఎంచుకోవడం సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా వేలాది ఎకరాల భూములు రాత్రికి రాత్రే కొంతమంది చేతుల్లోకి వెళ్లినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీన్ని తేల్చేందుకు కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ అండ్ ఆడిట్ ఎష్యూరెన్స్ సెంటర్ (కేఎస్‌ఏఏసీ) అనే ప్రభుత్వ రంగ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ సంస్థతో అవగాహన సైతం కుదుర్చుకుంది.
Also Read:Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో కీలక ప్రకటన
Forensic Auditing
తొలుత ఆడిటింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దానికోసం రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంచుకోవడం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ రెండు జిల్లాల్లో జరిగిన భూదందాల్లో కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌రావు ప్రమేయం ఉందని భావిస్తు్న్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట ఆ జిల్లాల్లోనే ఆడిటింగ్ చేయాలని భావించడం గమనార్హం. ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధివిధానాలను ఇప్పటికే రూపొందించినట్లు అధికారులు నర్మగర్భంగా చెబుతున్నారు.
Also Read : మరో కొద్దిగంటల్లో భారీ వర్షం..అప్రమత్తం చేసిన పోలీసులు
ధరణి పోర్టల్ అర్థరాత్రుల్లో పనిచేయడం, ఆ సమయంలోనే భూ రికార్డులు మారిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. చాలా భూములు నాటి అధికార పార్టీ నాయకుల పేరుతో రిజిస్టర్ అయినట్లు, వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని నాటి ప్రభుత్వ పెద్దలు తమ ఖాతాలో వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భూలావాదేవీలను పరిశీలించేందుకు వీలుగా అవసరమైన డిజిటల్, మాన్యువల్ రెవె న్యూ రికార్డులను ఆ సంస్థకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూ రికార్డు ల వ్యవహారం కావటంతో ప్రైవేటు సంస్థలకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు ఆడి టింగ్ బాధ్యతలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
ఈ రెండు జిల్లా ల్లోని అన్ని రికార్డులను ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫ లితాలను బట్టి ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కేరళ సంస్థతో ఒప్పందానికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ వద్ద ఉందని, ఆయన ఆమోదం లభించిన వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
నిజానికి ధరణి పోర్టల్‌లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని గతేడాదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, రెవెన్యూ శాఖలో సంస్కరణలు, ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావటం వంటి కార్యక్రమాలతో కాస్తా ఆలస్యం అయింది. ఆలస్యంగానైనా ఆడిటింగ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తామని రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
భూరికార్డుల మార్పిడి, మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల బదిలీ, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలతోపాటు అవి ఏ సమయంలో జరిగాయి? ఎక్కడి నుంచి జరిగాయి? ఏ అధికారి లాగిన్ ద్వారా జరిగాయనే వివరాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికోసం భూ లావాదేవీల డిజిటల్ ఫుట్ ప్రింట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వారు చెబుతున్నారు. కాగా, ఫోరెన్సిక్ ఆడిట్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జిల్లాలను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. అయితే, ఒకే దెబ్బతో కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌రావులను కొట్టాలని భావిస్తోన్న రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ఆడిట్‌ద్వారా వారి భూలావాదేవిలను బయటపెట్టాలని భావిస్తున్నారు.
Also Read : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం...ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్
harishrao | ktr | kcr | Siddipet District | rajanna sircilla | rajanna-district | dharani portal new update | Dharani Portal Issue | dharani | dharani portal