నా మాటలు సీరియస్‌గా తీసుకోవద్దు.. వారిపై గౌరవం ఉంది: కొండా మురళి!
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నవిభేదాలను పరిష్కరంచడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, కొండా మురళికి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు.
మంత్రి కొండా సురేఖ, మురళిల తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు. కొండా సురేఖ దంపతులపై పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు.