Konda Murali: కొండా మురళీ సంచలన ప్రకటన!

మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు. 

New Update
Konda Murali

Konda Murali

నిన్న రాత్రి మంత్రి కొండ సురేఖ ఇంటి దగ్గర అయిన లొల్లి అందరికీ తెలిసిందే. ఆమె ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళడం...సురేఖ కుమార్తె సుస్మిత వారితో గొడవ పడడం సంచలనం రేపింది. దాని వెంటనే సురేఖ, సుమంత్ కలిసి ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు. దీనిపై సుస్మిత మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలే ఇదంతా కావాలని చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులను ఇరికించేందకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుట్ర పన్నారని వ్యాఖ్యలు చేశారు. 

Also Read :  నవీన్ యాదవ్ Vs సునీత Vs దీపక్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? బలహీనతలు ఏంటి?

రేవంత్ అన్నంటే ఇష్టం..

ఇది ఇలా అంటే..మినిస్టర్ కొండా సురేఖ భర్త కొండా మురళి(konda murali) మాత్రం అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో నాకు గొడవలు లేవు. రాజశేఖర్రెడ్డి తరువాత రేవంత్ అంతటి వాడు.నేను ఆయన సీఎం కావాలనే అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ లో 271 ఓట్లతో సురేక గెలిచిందని..రేవంత్ రెడ్డి అంటూ ఆమెకు ఇష్టమేనని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదని కొండా మురళి అన్నారు.  నిన్ననే నేను ఫామ్ హౌస్నుంచి వచ్చానని తెలిపారు. నాకెప్పుడూ మినిస్టర్ల ఛాంబర్లకు వెళ్ళ అలవాటు లేదని..  కొండా సురేఖ ఛాంబర్ కు కూడా ఇప్పటి వరకు  పోలేదని చెప్పారు. స్మార్ట్ ఫోన్ చూడ్డం కూడా నాకు రాదు. సీఎం నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు...ఇస్తారు కూడా అని మురళి తెలిపారు.  రేవంత్ అన్న , పొంగులేటి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు నన్నెందుకు టార్గెట్ చేస్తారు అన అన్నారు. ఇప్పటికీ నాకు అవసరం అయితే రేవంత్ అన్న దగ్గరకే నేరుగా పోతాను.. మా ఇద్దరికీ ఆ అనుబంధం ఉంది అంటూ మురళి తెలిపారు.

మరి కుమార్తె సుస్మిత ఎందుకు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిందని ప్రశ్న అడగ్గా దానికి సమాధానంగా..నా బిడ్డకు కూడా ఏం తెలియదు.. ఆమె లండన్ నుంచి వచ్చింది అని మురళి సమాధానం చెప్పారు. నా బిడ్డకు ఏం పదవిలేదు. ఏ పార్టీకి చెందినది కాదు. దానికి అసలు ఈ గొడవతోనే సంబంధం లేదని తెలిపారు రాత్రి ఆమె పోలీసులతో గొడవ పడిన విషయం కూడా తనకు ఎవరో చెబితేనే...టీవీలో చూస్తేనే తెలిసిందని మురళి చెప్పారు. రాజీకీయాల గురించి మాట్లాడాలి అంటే కేసీఆర్ కూతురు కవిత దగ్గరకు వెళ్ళండి. ఆమెను అడగండి ఎందుకు తన తండ్రి ఫోటో పెట్టుకోను అని చెప్పింది అంటూ అని మురళి రిపోర్టర్లకు చెప్పారు. అంతేకానీ అసలేం తెలియన నా కూతురిని అడిగితే ఏం చెబుతుంది అంటూ ఆమెను వెనకేసుకుని వచ్చారు.   అలాగే సుమంత్ గొడవ గురించి ఎంత అడిగినా మురళి ఏం చెప్పలేదు. నాకేం తెలియదు, నేను లేను అంటూ మాత్రమే సమాధానం చెప్పారు. సురేఖ ఇప్పుడు ఎక్కడున్నారు అనే ప్రశ్నను కూడా దాట వేశారు. నాకేం తెలుసు నేను రాత్రి వచ్చి పడుకున్నా...ఇప్పుడే లేచా అంటూ మాట్లాడారు. 

Also Read :  రూ.38 వేల క్యాష్.. 4 కేజీల బంగారం.. మాగంటి సునీత ఆస్తుల లెక్కలివే!

Advertisment
తాజా కథనాలు