Communist Party Of India : నూరేళ్ల కమ్యూనిస్టు ప్రస్థానం..ఉద్యమ గమనంలో...గెలుపోటములు..చీలికలు

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవ‌త్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భార‌త క‌మ్యూనిస్టు పార్టీకి ఘ‌న చ‌రిత్ర ఉంది. దేశ‌వ్యాప్తంగా కార్మికులు, క‌ర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం ద‌క్కించుకుంది.

New Update
FotoJet (16)

A hundred years of communist rule

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవ‌త్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భార‌త క‌మ్యూనిస్టు పార్టీకి ఘ‌న చ‌రిత్ర ఉంది. దేశ‌వ్యాప్తంగా కార్మికులు, క‌ర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం ద‌క్కించుకుంది. గత వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర మహోన్నతమైనది.  రష్యా(russia) అక్టోబర్ విప్లవ ప్రభావంతోనే ఇండియాలో కూడా 1925లోనే రాడికల్ హ్యుమనిస్టు యంయన్.రాయ్,  దత్,యస్ఏ డాంగే, తదితర కార్మిక నేతల నేతృత్వంలో “కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా” సీపీఐ(cpi) కి అంకురార్పణ జరిగింది. ఆనాటి బ్రిటిష్ వలసవాదులు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అప్పట్లో రహస్యంగా పనిచేయవలసి వచ్చింది. 

దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎన్నెన్నో ఉద్యమాలు చేసారు. గ్రామీణ రైతాంగ ఉద్యమాలు మొదలు, పట్టణ పారిశ్రామిక కార్మికుల ఉద్యమాలు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు , ఉపాధ్యాయ, బ్యాంకు, రైల్వే, ఆర్టీసీ , ఎలక్ట్రిసిటీ , టెలిఫోన్, ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, బీడీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులైతేనేమి, ఇళ్ల స్థలాల ఉద్యమాలైతే నేమి , జీతాలు, కూలీలు, బోనసులు, పని పరిస్థితుల మెరుగుదల మొదలైన వన్నీ కోట్లాది ప్రజలకు అందిన మేరకు అవన్నీ కమ్యూ నిస్టు ఉద్యమాల ఫలితాలే. లక్షలాది కమ్యూనిస్టు కార్యకర్తల , నాయకుల త్యాగాల ఫలితమే నేడు అమలులో ఉన్న ప్రావిడెంటు ఫండ్ , పెన్షన్, సెలవులు, 8 గంటల పని, తదితర సౌకర్యాలు. ఆదివాసీ గిరిజనులకు,పేదలకు కొన్నయినా భూములు దక్కాయంటే కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, వేలాది మంది ప్రాణ త్యాగాలతో సాధించి పెట్టినవే. ఇంతటి మహత్తర ఉద్యమాల చరిత్ర వేల వేల పేజీలు వేలాది పుస్తకాలుగా డాక్యుమెంట్లుగా రికార్డయి వున్నాయి.

Also Read :  సిరియాలో ఉగ్రదాడి, మసీదులో పేలిన బాంబు.. 8 మంది మృతి

100 Years Of Communist Party Of India

నిజానికి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది చ‌ర్చిస్తారు. కానీ, కాంగ్రెస్ కంటే కూడా ముందుగానే గ్రామాల్లో ప‌రిఢ‌విల్లిన పార్టీ సీపీఐ(cpi) అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా.. నాలుగు రోడ్ల కూడ‌లిలో ఎర్ర జెండా ఎగ‌రేసే దిమ్మెలు ద‌ర్శన‌మిస్తాయి.క‌నీసంలో క‌నీసం ప‌ది మంది అయినా.. నాయ‌కులు, కార్యక‌ర్తలు గ్రామాల్లో క‌నిపిస్తారు. అలా ఒక‌ప్పుడు ప్రాభ‌వాన్ని సంత‌రించుకున్న పార్టీ, పశ్చిమబెంగాల్‌, కేర‌ళ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా వ‌చ్చింది.  

నైజాం రాజరికం ఉన్న తెలంగాణ రాష్ట్రం లో భూస్వామ్య శృంఖలాలు తెంచడంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకమైనది.ఆంధ్రమహాసభ కార్యక్రమం లో రహస్యంగా ప్రవేశించి గ్రంధాలయ ఉద్యమం,రాత్రి బడులు లాంటి చిన్న చిన్న సంస్కరణలు ద్వారా రైతాంగ ఉద్యమానికి పునాదులు వేసింది.చివరకు అది ‘తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం’ గా మారి ఐదు లక్షల గ్రామాలకు ఎర్రజెండా విస్తరించింది.”దున్నే వానికే భూమి”కీలక నినాదం ను ముందుకు తేవడం ద్వారా దేశంలో భూసంస్కరణలు అమలు జరపడానికి కమ్యూనిస్టుల పోరాటమే మూలం.

సైద్దాంతిక గందరగోళం మధ్య సరైన పంథాలో పయనం సాగించలేకపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 1964లో రెండుగా చీలింది.  సీపీఐ నుంచి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) సీపీఎం పార్టీ అవతరించింది. సీపీఐకి చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్ల గిరి ప్రసాద్, సీపీఎంనకు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య లాంటి దిగ్గజాలు నేతృత్వం వహించారు. కమ్యూనిస్టు పంథా విషయంలో తిరిగి సీపీఎం పార్టీలో తలెత్తిన విబేధాల మూలంగా 1967లో మరో చీలికకు దారితీసి ‘నక్సల్ బరీ ‘గ్రామంలో తలెత్తిన తిరుగుబాటుతో (భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, లెనినిస్ట్ పార్టీ ,సీపీఐ(ఎంఎల్‌)గా ఉనికిలోకి వచ్చింది.బెంగాల్ నక్సల్బరీ రైతాంగ ఉద్యమం విభేదాలలోనే చారుమజుందార్, కానూసన్యాల్, వినోద్ మిశ్రా లాంటి నేతలు నక్సలైట్ ఉద్యమానికి బాటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో దేవులపల్లి వెంకటేశ్వరరావు,తరిమల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి,పైలా వాసుదేవరావు, కొండపల్లి సీతారామయ్య లాంటి నేతలు పనిచేశారు.  

కమ్యూనిస్టు ఉద్యమంలో నిజానికి1948 నుండే చీలికలు మొదలయ్యాయి. 1948లో శిబ్దాశ్ ఘోష్ విడిపోయి వేరే పార్టీని ఉద్యమాలను నిర్మించారు. అది నేటికీ బలమైన ట్రేడ్ యూనియన్ గా జాతీయ స్థాయిలో కొనసాగుతుంది. నేటికి కూడా కమ్యూనిస్టులు అనేక చీలికలు పేలికలు కావడంతో వారి ఉద్యమాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. తెలుగు రాష్ర్టాల్లోనే సీపీఐ ఎంఎల్‌ లో అనేక చీలికలు కనిపిస్తాయి. జనశక్తి, ప్రజాపంథా, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన, లిబరేషన్‌, న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీ(moaists), యూసీసీఆర్‌ఐ ఎంఎల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో చీలికలుగా కమ్యూనిస్టు పార్టీ ముక్కలుచెక్కలైంది.నేడు వివిధ పార్టీలుగా , గ్రూపులుగా ఉన్నప్పటికీ  వారంత కమ్యూనిస్టు  వారసులే అని పేర్కొనవచ్చు.  - CPM Protest

Also Read :  16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

అయితే నిర్మాణ రీత్యా కార్యాచరణలో కమ్యూనిస్టు పార్టీలు(Communist Party) ప్రజలకు దూరమవుతున్నాయి . మార్కెట్ ఎకానమీ ప్రపంచాన్ని అదుపు లోకి తీసుకొని ఆధిపత్యం చెలాయించడం మొదలై దశాబ్దాలు గడిచాయి. నాటి స్పూర్తి దాతలైన రష్యా విడిపోయింది. రష్యా, చైనా తదితర తమ్యూనిస్టు దేశాలు కూడా మార్కెట్ ఎకానమీలో భాగమై ముందుకు సాగుతున్నారు. అంబేద్కర్, నెహ్రూ, లోహియా , కమ్సూనిస్టులు ఎంతో ఆశలు పెట్టుకున్న నేషనలైజేషన్ స్థానంలో యూ టర్న్ తీసుకొని ప్రపంచీకరణ పేరిట ప్రయివేటీకరణ ముందుకు సాగుతున్న దశ. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం స్థానంలో తిరిగి పన్నెండు, పద్నాలుగంటల పని విధానం చాపకింది నీరులా ముందుకు వస్తున్నది. సంఘటిత శక్తుల్లో నీరసం ఆవహించింది. వందేళ్లలో ఊహించని వారెందరో ఆర్థిక వ్యవస్థలో ఎదిగి రాజకీయాలను నిర్దేశిస్తున్నారు. కార్మిక వర్గాన్ని సమిష్టి పారిశ్రామిక వర్గంగా ఎదిగించాలనే ఆలోచన చేయకపోవడం వల్ల కమ్యూనిస్టు లకు సొంత వనరులు , సొంత లాబీలు తగ్గి పోయాయి. కమ్యూనిస్టు పార్టీలకు అనేక ఆంక్షలు ఉన్నా శ్రామికుల సమ్మెలు, రైతాంగ ఉద్యమాలలో పార్టీ గ్రూపులు పనిచేస్తూనే వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు