విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 25 శాతం తగ్గనున్న పదో తరగతి సిలబస్

దేశంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ.. విద్యారంగంలో మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్‌ భారాన్ని తగ్గించనుంది. 25 శాతం సిలబస్‌ను తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
Kerala To Slash Class 10 Syllabus By 25 percent from Next Academic Year

Kerala To Slash Class 10 Syllabus By 25 percent from Next Academic Year

దేశంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ.. విద్యారంగంలో మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్‌ భారాన్ని తగ్గించనుంది. 25 శాతం సిలబస్‌ను తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం కేరళలోని కొల్లాంలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి ఈ ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.  

Also Read: కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

పదో తరగతి విద్యార్థులపై సిలబస్‌ ఎక్కువగా వారిపై ఒత్తిడి పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. సిలబస్‌ను తగ్గించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కేరళ ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల సూచనల మేరకు 25 శాతం సిలబస్‌ను తగ్గించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో 25 శాతం తగ్గినప్పటికీ కంటెంట్‌ మాత్రం మారకుండా చూసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

Also Read: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 2 గంటలే ప్రయాణం.. అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన

ఇదిలాఉండగా సిలబస్‌ను తగ్గించడం వల్ల విద్యావ్యవస్థ బలహీనమవుతుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఈ వాదనలను మంత్రి శివకుట్టి ఖండించారు. వాళ్లు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు. ఏ సిలబస్‌ను తొలగించినా కూడా జాగ్రత్తగా చేస్తామని తెలిపారు. సిలబస్‌లో ఉండే కీలక, మూల అంశాన్ని తొలగించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిస్థాయిలో కూడా ఏ అంశం మరోసారి రాకుండా చేసి సిలబస్‌ను తొలగిస్తామని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు